బీర్కూర్, జూన్ 8: ‘ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని నోరుపోయేలా అరుస్తుంటే.. మీరు ఏం చేస్తున్నారు.. పట్టణ ప్రగతి అంటే ఇదే నా..’ అంటూ బాన్సువాడ మున్సిపల్ అధికారులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఆయన బుధవారం పర్యటించారు. కాలనీలో ఉన్న డ్రైనేజీలను పరిశీలించారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడంపై మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. తానే స్వయంగా డ్రైనేజీలోని కర్రసహాయంతో చెత్తను తొలగించారు. మురికి కాలువలను ఎప్పటికప్పు డు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించా రు. తమ ఇంటితో పాటు కాలనీని శుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులను ఉద్దేశించి స్పీక ర్ మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని, దీంతో ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను పెంచాలన్నారు. పట్టణంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర సౌకర్యాల కోసం నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. ఇల్లు, ఇంటి స్థలం లేని పేదవారికోసం దశల వారీగా 150 ఎకరాల భూమిని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసి పంపిణీ చేశామన్నారు. పేదలకు పంపిణీ చేసిన ఇండ్ల స్థలాలను ఎవరు కూడా అమ్ముకోవద్దని, అమ్మినా కూడా కొనుగోలు చేయకూడదని అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అమ్మి తే ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. చెత్తను రోడ్లు, మురికి కా కాలువల్లో వేయవద్దని, చెత్త బుట్టల్లో వేయాలని సూచించారు. అనంతరం అందరితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ భవనం, మినీ స్టేడి యం నిర్మాణ పనులను స్పీకర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి పాల్గొన్నారు.