కామారెడ్డి, జూన్ 8: కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరింది. యాసంగి వడ్లు కోనబోమని కేంద్ర ప్రభుత్వం మెండికేసినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించి రైతాంగానికి అండగా నిలిచింది. కామారెడ్డి జిల్లాలో 45రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 344 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2లక్షల 47వేల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుతం 22 మండలాలకు గాను 15 మండలాల్లో ప్రక్రియ ముగిసింది. ధాన్యం సేకరణ సజావుగా సాగడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2లక్షల 47వేల మెట్రిక్ టన్నుల ధాన్యం..
కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లో గతంలో కన్నా వరి సాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. పంట చేతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో 90శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో వంద శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జుక్కల్ నియోజకవర్గంలో 95 శాతం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 80శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. నిజాంసాగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, భిక్కనూర్, బీబీపేట, దోమకొండ మండలాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలకు గాను 15 మండలాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి.
రైతుల ఖాతాల్లో రూ.315 కోట్ల జమ
రాష్ట్రంలో ధాన్యం సేకరణలో కామారెడ్డి జిల్లా మరోసారి మూడో స్థానంలో నిలిచింది. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల తర్వాత ధాన్యం ఉత్పత్తిలో కామారెడ్డి మూడో స్థానంలో ఉంది. యాసంగిలో ఐకేపీ ఆధ్వర్యంలో 20 కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 8 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 316 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 50,215 మంది రైతుల నుంచి 2,47,914 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 2,40,988 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. మరో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు కొనుగోళ్లను నిర్వహిస్తున్నారు. మరో వారంపాటు లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, భిక్కనూర్, బీబీపేట, దోమకొండ మండలాల పరిధిలో కొనుగోళ్లు నిర్వహిస్తారు. 2.47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను రూ.483కోట్లలకు గాను ఇప్పటికే రూ.315కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 1.96లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి రూ.386 కోట్లకు ట్యాబ్ ఎంట్రీని నిర్వహించారు.
ఇప్పటి వరకు 1.86లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఎంట్రీ చేశారు. ఐకేపీకి సంబంధించి 10 కేంద్రాలు, మార్కెట్ కమిటీలకు సంబంధించి 4 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన 122 కొనుగోలు కేంద్రాలు మూసివేశారు. జిల్లాలో 62,38,750 గన్నీ బ్యాగుల అవసరం ఉండగా, 61,97,868 బ్యాగులను వినియెగించారు. మరో 40,882 గన్నీ బ్యాగులు వివిధ కేంద్రాల్లో ఉన్నాయి. రెండు మండలాలను కలిపి ఒక క్లస్టర్‌గా విభజించి, క్లస్టర్ల నుంచి ప్రతి రోజూ 250 నుంచి 350 లారీల ద్వారా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నంబరుతోపాటు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించారు. రాష్ట్రప్రభుత్వం ఏ గ్రేడ్ క్వింటాలు ధాన్యానికి రూ.1960, కామన్ గ్రేడ్ ధాన్యానికి రూ.1940 మద్దతు ధరను అందించింది. అమ్మిన ధాన్యం డబ్బులు వెంటనే అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కేంద్రం ముందుకు రాకపోయినా..
కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై మాట తప్పింది. రైతు బిడ్డ, స్వయాన రైతు అయిన సీఎం కేసీఆర్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. దళారులను నమ్మి మోసపోవద్దు.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
జాప్యం లేకుండా కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లు చేయాల్సిన కేంద్రం చేతులెత్తేయడంతో సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను అమలు చేయాల్సిన కేంద్రం అన్నదాతలను దగా చేసింది. వారం వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అందించడం కేసీఆర్ ప్రభుత్వంతో సాధ్యమైంది.
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్
కేంద్రం ముందుకు రాకపోయినా..
కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై మాట తప్పింది. రైతు బిడ్డ, స్వయాన రైతు అయిన సీఎం కేసీఆర్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. దళారులను నమ్మి మోసపోవద్దు.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
జాప్యం లేకుండా కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లు చేయాల్సిన కేంద్రం చేతులెత్తేయడంతో సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను అమలు చేయాల్సిన కేంద్రం అన్నదాతలను దగా చేసింది. వారం వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అందించడం కేసీఆర్ ప్రభుత్వంతో సాధ్యమైంది.
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్
నిత్యం పర్యవేక్షణ చేపట్టాం
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా నిత్యం పర్యవేక్షణ చేశాం, ఎక్కడా రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు రూ.315కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
– చంద్రమోహన్, అడిషనల్ కలెక్టర్, కామారెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా నిత్యం పర్యవేక్షణ చేశాం, ఎక్కడా రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు రూ.315కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
– చంద్రమోహన్, అడిషనల్ కలెక్టర్, కామారెడ్డి