బాన్సువాడ, మార్చి 30 : రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తూ బంగారు తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నారని హోం శాఖ మం త్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలోని కోటగిరి మండలంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ పోచారం స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. స్పీకర్ పోచారం కులమతాలకతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నారని అన్నారు. 2009 ఉపఎన్నికల సమయంలో బాన్సువాడలో పర్యటించానని తెలిపారు. అప్పట్లో బాన్సువాడ మండల కేంద్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని, రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కోట్లాది రూపాయలతో నియోజకవర్గ రూపురేఖలు మార్చారని తెలిపారు. పోచారం లాంటి నాయకుడు బాన్సువాడకు ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి వచ్చిన హోం మంత్రిని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుష్పగుచ్ఛం, మొక్కను అందజేసి ఘనంగా స్వాగతించారు. మంత్రి మహమూద్ అలీ స్పీకర్ స్వగృహం వద్ద గౌరవ వందనం స్వీకరించారు. కామారెడ్డి ఎస్పీ శ్రీ నివాస్ రెడ్డికి మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు.
తండ్రికి తగ్గ తనయుడిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్క ర్ రెడ్డి ప్రజలతో మమేకమై నియోజక వర్గం లో మంచి పేరు సంపాదించాడని హోం మహమూద్ అలీ మంత్రి భాస్కర్‌రెడ్డిని అభినందించారు. భాస్కర్ రెడ్డి పేరు ఇటీవల కాలంలో ప్రజల నుంచి, యువకుల నుంచి బాగా వినిపిస్తుందని, ప్రజల కష్ట సు ఖాల్లో పాలుపంచుకుంటున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ గుప్తా, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, ఆత్మ కమిటీ అధ్యక్షుడు మోహన్‌నాయక్, సర్పంచులు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.