పేద మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కోటగిరి మండలకేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మించనున్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రికి ఘన స్వాగతం లభించింది.
-బోధన్, మార్చి 30
బోధన్, మార్చి 30: అంతర్జాతీయ ప్రమాణాలతో పేద మైనార్టీ, బీసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సుమారు వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కో టగిరి మండల కేంద్రంలో రూ. 6 కోట్ల వ్యయంతో ని ర్మించనున్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి బుధ వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణాను అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఫలితంగానే రాష్ట్రం అన్ని రంగా ల్లో నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుం డడంతో సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఓ మహాత్ముడిలా భావిస్తున్నారని అన్నారు. తెలంగాణ మహాత్మాగాంధీ కేసీఆర్ అని అభివర్ణించారు. కోటగిరిలో శంకుస్థాపన జరిగిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనం నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. ‘మా శాసనసభ్యులంతా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదం తీసుకుంటామని, ఆయన అంటే మాకు అంతా గౌరవం’ అంటూ హోంశాఖ మంత్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కొనియాడారు.
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే అది చదు వు ద్వారానే సాధ్యమని, ఈ విషయాన్ని దృష్టిలో ఉం చుకునే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా మంచి ప్రమాణాలతో రా్రష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాక ముందు 240 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా 726 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య ప్రస్తుతం 206కు పెరిగిందన్నారు. ఇవి కాకుండా 120 ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాలల ను ఏర్పాటు చేశారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఉందన్నా రు. గురుకులాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇంతటి చక్కటి అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకొని పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారిని చదివించాలని కోరారు.
గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన చక్కటి భోజనాన్ని పిల్లలకు అందిస్తున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎక్కడైనా వా ర్డెన్లు నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని, ఆకస్మిక తనిఖీలు చేస్తానని హెచ్చరించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి అర్హుడికి డబుల్బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పది వేల ఇండ్లు మంజూరైన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అన్నారు. ఇండ్ల కోసం ఎవరైనా పైరవీలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీచేస్తున్న దృష్ట్యా అవసరమైన శిక్షణ కోసం తమ కుటుంబం తరపున బాన్సువాడ, వర్నిల్లో రెం డు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో మైనార్టీ రె సిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ అసిస్టెంట్ సెక్రటరీ యూ సూఫ్ అలీ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఎం పీపీ వల్లేపల్లి సునీతా శ్రీనివాస్‌రావు, జడ్పీటీసీ శంకర్‌పటేల్, కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ తేళ్ల లావణ్యా అరవింద్, సీపీ నాగరాజు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు ఎజాజ్‌ఖాన్, రవి, శ్రీనివాస్‌రావు, కూచి సిద్ధు, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.