నిజామాబాద్ సిటీ/విద్యానగర్, మార్చి 30: మహిళా సంఘాలకు 2020-21 అర్థిక సంవత్సరంలో లక్ష్యం మేర స్త్రీనిధి రుణాలు అందిండంతోపాటు రికవరీలోనూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ముందువరుసలో నిలిచాయి. ఈ మేరకు ఉభయ జిల్లాలకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన స్త్రీనిధి తొమ్మిదో వార్షిక మహాసభలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతులమీదుగా నిజామాబాద్, కామారెడ్డి డీఆర్డీవోలు చందర్‌నాయక్, వెంకటమాధవరావు అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో స్త్రీనిధి డైరెక్టర్ ఉషారాణి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు.