నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 27 : చిన్నారులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ను అందించేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా వారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. నగరంలోని చంద్రశేఖర్‌కాలనీ హెల్త్ సెంటర్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలి యో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో లక్షా85వేల మంది ఐదేండ్లలోపు పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సోమ, మంగళవారాల్లో కూడా పల్స్‌పోలియో కార్యక్రమం కొనసాగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. అదనపు కలెక్టర చంద్రశేఖర్ దంపతులు ఖలీల్వాడిలోని మోడ్రన్ ప్లబిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సెంటర్లో తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించా రు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు రాములు, డీఎంహెచ్‌వో సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ తుకా రాం, వైద్యాధికారులు పాల్గొన్నారు.
పోలీస్‌లైన్‌లో ఉన్న వెల్ఫేర్ దవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చిన్నారికి పోలియో చుక్కలు వేసి సీపీ నాగరాజు ప్రారంభించారు. అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) వినీత్, డాక్టర్ అంబిక, మెడికల్ ఆఫీసర్ కే.సుజాత, ఆశ వర్కర్ కే.స్వప్న, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్, దేవాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 27 : నిజామాబాద్ వాప్తంగా 92.03 శాతం పల్స్‌పోలియో పూర్తి చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. అత్యధికంగా జక్రాన్‌పల్లి మండలంలో 98.43 శాతం,అత్యల్పంగా బోధ న్లో 76.18 శాతం పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. మొత్తం 1,87,848 మంది చిన్నారు లకు గాను 1,72,880 మందికి పోలియో చుక్కలు వేసినట్లు వివరించారు.