కామారెడ్డి/ ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంకే ముజీబుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్‌షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితోపాటు పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
ముజీబుద్దీన్ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లపై గులాబీ జెండాలతో పాటు ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. దాదాపు రెండువేల మంది హాజరయ్యే అవకాశం ఉందని పార్టీనేతలు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్, తాగునీరు, భోజన వసతి కల్పిస్తున్నారు.
ప్రమాణస్వీకారోత్సవం ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బుధవారం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, మిన్కూరి రాంరెడ్డి, గడ్డం చం ద్రశేఖర్‌రెడ్డి, నిట్టు కృష్ణమోహన్, ముప్పారపు ఆనంద్, గైని శ్రీనివాస్‌గౌడ్, జూకంటి ప్రభాకర్‌రెడ్డి, పిప్పిరి వెంకటి, గెరిగంటి లక్ష్మీనారాయణ, హఫీజ్ బేగ్, మాసుల లక్ష్మీనారాయణ, కుంచాల శేఖర్, కుంబాల రవి ఉన్నారు.
ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు కూతురు వివాహాన్ని హైదరాబాద్‌లోని న్యూలైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చిలో మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. వేడుకలకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -ఆర్మూర్, ఫిబ్రవరి 23
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారిగా జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని సన్మానిస్తున్న జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు.
-నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 23