నిజామాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమై తొలిసారి జిల్లాకు వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఇందల్వాయి నుంచి అంగరంగ వైభవంగా మొదలైన కార్యక్రమం నిజామాబాద్ నగరానికి చేరుకోవడానికి 4 గంటల సమయం పట్టింది. భారీ వాహన శ్రేణికి తోడుగా వేలాది మంది పార్టీ శ్రేణుల కేరింతల మధ్య జీవన్‌రెడ్డి ప్రధాన రహదారి గుం డా నిజామాబాద్ నగరానికి వచ్చారు. దారి పొడవునా టీఆర్ఎస్ నాయకులు అడుగడుగునా గజమాలలతో సన్మానించారు. పటాకులు కాల్చి, గులాబీ రంగులు చల్లుకుంటూ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసింది. విజయ సూచికగా ప్రజా ప్రతినిధులంతా జీవన్ రెడ్డికి ఖడ్గాన్ని బహుకరించారు. అంతా కలిసి సీఎం బర్త్ డే సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేశారు.
జీవన్ రెడ్డికి అపూర్వ స్వాగతం దక్కడం, ఒకే వేదికపై నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా ఆసీనులు కావడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు షకీల్, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మార గంగారెడ్డి, ఆకుల లలిత, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మా ర్కెట్ కమిటీ చైర్మన్లు సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొనడం, నూతన జిల్లా అధ్యక్షుడికి స్వాగతం తెలియజేయడం ద్వారా గులా బీ దళంలో జోష్ కనిపించింది. వేదికపై ము ఖ్య అతిథులంతా కేసీఆర్ పరిపాలనను కొని యాడారు. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టడం ద్వారా శ్రేణులకు దిశా నిర్దేశ నం చేశారు. అదే స్థాయిలో నూతన జిల్లా అ ధ్యక్షుడు సైతం స్పందించి ఎంపీ అర్వింద్‌పై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిజామాబాద్ జిల్లా కొనసాగుతున్నది. అనేక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలు పట్టం కట్టిన వారే. అదే ఉత్సాహంతో 2014, 2018 ఎన్నికల్లో దిగ్విజయమైన తీర్పును ఇందూరు ప్రజ లు అందించారు. రానున్న భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తి చాటే విధం గా, ప్రజ ల్లోకి మరింతగా టీఆర్ఎస్ పార్టీ చొచ్చుకెళ్లేందుకు టీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టి సారించింది. జీవన్ రెడ్డిని జిల్లా సారథిగా ప్రకటించిన నాటి నుంచి జిల్లాలో కొంగొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల అబద్ధాలను తేటతెల్లం చేయడంతో పాటు దూకుడుగా దూసుకెళ్లే స్వభావం కలిగిన జీవన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అందివ్వడం మూలంగా కాంగ్రెస్, బీజేపీలకు ము చ్చెమటలు పట్టించడంలో విజయవం తం కావడం తథ్యమనే భావన అందరిలోనూ ఏర్పడింది. కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన సభలో జీవన్ రెడ్డిని అభినందిస్తూ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు అంతా ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు.