ఖలీల్‌వాడి, జూలై 22 : జిల్లా కేంద్రంలో తమకు సంఘ భవన నిర్మాణానికి స్థలంతోపాటు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితను గంగపుత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్‌కుమార్, సంఘం ప్రతినిధులు కోరారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీని శుక్రవారం కలిసి విన్నవించారు. 2 లక్షల జనాభా ఉన్న గంగపుత్రులకు జిల్లా కేంద్రంలో సంఘ భవనం లేదని, సంఘ భవనానికి స్థలం, నిధులు కేటాయించాలని, ఇతర కులాల వారు బీసీ ఏ సర్టిఫికెట్తో రిజర్వేషన్లు పొందుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలోని హనుమాన్ జంక్షన్లో సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు రుక్తె లక్ష్మీనర్సయ్య, వాసు, గంగాధర్, నారాయణ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ కులాల నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తమ సమస్యలను విన్నవించారు. జిల్లా కేంద్రంలో బీసీ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలం, భవన సముదాయానికి సహకరించాలని బీసీ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కోరారు. కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక సలహాదారులు రాజారాం యాదవ్, జిల్లాఅధ్యక్షుడు నరాల సుధాకర్, టెలికం బోర్డుమెంబర్ సతీశ్ తక్కూరి, దర్శనం దేవేందర్, లక్ష్మణ్‌గౌడ్, చింత మహేశ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.