నందిపేట్, ఫిబ్రవరి 8: టీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా గులాబీ పార్టీలో చేరుతున్నారు. నందిపేట్ మండలంలోని మున్నూరుకాపు సంఘ సభ్యులతోపాటు చౌడమ్మ కొండూర్ గ్రామానికి చెందిన యువకులు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి నాయకు లు, కార్యకర్తలు మంగళవారం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయా గ్రామాల నుంచి వచ్చిన సుమారు 500 మంది మున్నూరుకాపు సంఘ సభ్యులు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. మండలంలోని 31 గ్రామాల మున్నూరుకాపు సభ్యులమంతా టీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా నిలుస్తున్నట్లు ఈ సందర్బంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవేందర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, చింరాజ్‌పల్లి సర్పంచ్ గణేశ్, నాయకులు ఎర్రం ముత్యం, సిలిండర్ లింగం, మచ్లర్ల గంగా రాం, మురళి, నారాయణ, చౌడమ్మ కొండూరు ఎంపీటీసీ సభ్యుడు దాత్రిక రాజు, నాయకులు ఎర్రం ము త్యం, భూమేశ్, ఈశ్వర్ గౌడ్, భరత్ పాల్గొన్నారు.
రుద్రూర్/ వర్ని, ఫిబ్రవరి 8: రుద్రూర్ మండలంలోని చిక్కడ్పల్లి గ్రామంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఉప సర్పంచ్ నరేందర్‌తో పాటు వార్డు సభ్యులు ఎర్రోళ్ల లక్ష్మీగంగాధర్, సునీత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుడిసె పోశెట్టి, నర్సింహులు, అంగర్గ బస్వయ్య మంగళవారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సాయిలు, వైస్‌ఎంపీపీ సాయిలు, పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, కో-ఆప్షన్ సభ్యుడు మస్తాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, నాగేందర్, హన్మంతు, లాల్‌మహ్మద్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. వర్ని మండలం కోటయ్య క్యాంపు గ్రామానికి చెందిన 150 మంది వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, మండల కో -ఆప్షన్ సభ్యుడు కరీం, సత్యనారాయణపురం ఉప సర్పంచ్ కంది కృష్ణ, టీఆర్ఎస్ వర్ని మండల అధ్యక్షుడు కల్లాలి గిరి, సీనియర్ నాయకుడు మేక వీర్రాజు, పెనిమర్తి శ్రీహరి పాల్గొన్నారు.