ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వేల్పూర్, మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజాప్రతినిధులు భారీ కేక్‌ను కట్ చేశారు. అన్నదానాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు కొనసాగాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆలయాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని చోట్ల కేక్ కటింగ్, మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగాయి.