డిచ్పల్లి, ఫిబ్రవరి 16: ఖిల్లా డిచ్పల్లి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజికెడ్డి గోవర్ధన్ దంపతులు, సీపీ నాగరాజు వేడుకల్లో పాల్గొ ని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామపెద్దలు, భక్తులు ఆలయకమిటీ సభ్యులు సీతారామచంద్రస్వామి గోవిందా, గోవిందా అంటూ నినాదాలు చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. అర్ధరాత్రి వరకు గ్రామంలోని ప్రధానవీధుల గుండా సీతారాముల రథయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్ మోహన్, దాసరి ఇందిర లక్ష్మినర్సయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఖిల్లారామాలయ చైర్మన్ పొద్దుటూరి మహేందర్రెడ్డి, సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి,ప్రధాన అర్చకుడు ముల్లంగి అదిత్య శర్మ తదితరులు పాల్గొన్నారు.