రుద్రూర్, మార్చి 2 : పార్టీని నమ్మకున్న కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన పార్టీ కార్యకర్తలు కాట్రపు పార్వతి, చిక్కడ్‌పల్లికి చెందిన మచ్కూరి మనోహర్ ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాలకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి బాన్సువాడలో బుధవారం బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు రూ.2లక్షల బీమా అందజేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, విండోమాజీ చైర్మన్ పత్తి రాము, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, చిక్కడ్పల్లి రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ హన్మంతు, చిక్కడ్పల్లి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు మోహన్, సీనియర్ నాయకులు నాగేందర్, లాల్‌మహ్మద్, మచ్కూరి రాము, రవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.