కంటేశ్వర్ ,ఫిబ్రవరి 5 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో నిజాంబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సుల(Ballot boxes) నిర్వహణ, మరమ్మతులు బుధవారం ప్రారంభమయ్యాయి. బ్యాలెట్ బాక్సుల మరమ్మతు నిర్వహణ పనులను డిపిఓ శ్రీనివాస్ పరిశీలించారు. డిపిఓ వెంట సీనియర్ అసిస్టెంట్ రాజబాబు ఇతర సిబ్బంది ఉన్నారు.
నీటి సరఫరాను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు
నిజాంబాద్ నగరంలో నీటి పన్ను చెల్లించాలని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ కోరారు. ప్రజలు తమ నీటి బకాయిలు చెల్లించి సహకరించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బుధవారం నగరంలోని నీటి పన్ను చెల్లించని పలువురి నల్ల కనెక్షన్లను తొలగించారు. నీటి పన్ను చెల్లించకుంటే కచ్చితంగా నీటి సరఫరా తొలగిస్తామని డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ తెలిపారు.