Nizamabad CP Sai Chaitanya | వర్ని(రుద్రూర్), మార్చి 24 : బోధన్ నుండి హైదరాబాద్ వెపై వెళ్తన్న ఆర్టీసీ బస్సు, దానికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెఎన్సీ కాలనీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నిజామాబాద్ సీపీ పీ సాయి చైతన్య హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకొన్నారు. ట్రాఫిక్ ను నియంత్రించి వాహనాలను జేసీబీ సహాయంతో అక్కడి నుండి తొలగించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బోధన్ ఏసీపీ పీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.