National Sports Day | కంటేశ్వర్, ఆగస్టు 29 : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి భూలోకం విజయకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి బీ పవన్ కుమార్ ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు.
క్రీడా దిగ్గజాలను గౌరవించడానికి ,శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడానికి 2025 థీమ్, శాంతియుత సమాజాలను ప్రోత్సహించడానికి క్రీడలు, ఐక్యత, జట్టుకృషిని పెంపొందించడంలో క్రీడల పాత్ర చెప్పలేదనిదని అన్నారు. అనంతరం రాష్ట్ర సైకిల్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు భారతదేశం ఉత్సాహంతో పునరుజ్జీవింపబడుతుందని, ఇది కాలంగా పరీక్షించబడిన పోటీతత్వం, సహకారం, శారీరక శ్రేయస్సు, శక్తివంతమైన జ్ఞాపకార్థం అని అన్నారు. ప్రతీ మనిషి జీవిత క్రీడ, మైదానం, వెలుపల క్రమశిక్షణ, స్థితిస్థాపకత, ఐక్యతను పెంపొందించుకోవడం ద్వారా ఛాంపియన్గా ఉండగలరని ఇది గుర్తు చేస్తుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, రవి పబ్లిక్ స్కూల్ పాఠశాల యాజమాన్యం సరళ మహేందర్ రెడ్డి, శ్యామ్ కుమార్, పీఈటీ శ్రీకాంత్, సైకిలింగ్ సంఘం సభ్యులు దుర్గ మల్లేష్, ప్రభాకర్, ఆర్ నరేష్ కుమార్, మురళి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.