భారత రాష్ట్ర సమితి అవతరణ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని.. రాష్ర్టాన్ని ప్రగతి పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్‌కు దేశాన్ని అభివృద్ధి చేసి అగ్రదేశాల సరసన చేర్చే సత్తా ఉన్నదని తెలిపారు. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, రైతును రాజుగా చేసిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని వెల్లడించారు.
పిట్లం, డిసెంబర్ 9 :కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించి తెలంగాణలో అమలు చేస్తున్న సం క్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేసి న విధంగానే యావత్ దేశాన్ని అభివృద్ధి చేస్తారు. ఆయన నాయకత్వంపై దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది.
-కవితాపాటిల్, విద్యావంతురాలు, కంభాపూర్
బాన్సువాడ రూరల్, డిసెంబర్ 9 : అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చడంతోపాటు ప్రజలకు దేశ సంపద దక్కాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది.
– తాటి రామకృష్ణ, వ్యాపారవేత్త, బాన్సువాడ.
మద్నూర్, డిసెంబర్ 9 : భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా విస్తరించాలి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా చేరాలి. దేశ ప్రజలకు మేలు చేసేందుకు వస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు.
-డాక్టర్ కిరణ్, మద్నూర్
మద్నూర్, డిసెంబర్ 9 :తెలంగాణ అభివృద్ధి చెందిన మాదిరిగానే.. దేశాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. అభివృద్ధిలో అగ్రదేశాల సరసన భారత్ చేరాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందే. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి తరుణం.
-శ్రీనివాస్, సమాజ సేవకుడు, మద్నూర్
బిచ్కుంద, డిసెంబర్ 9: దేశం కోసం భారత రాష్ట్ర సమితి పురు డుపోసుకున్నది. ప్రజలకు సేవ లందించేందుకు సీఎం కేసీఆర్ జా తీయ రాజకీయాల్లోకి వెళ్తుండ డం శుభపరిణామం. దేశ రాజకీయా ల్లో సమూల మార్పు వస్తుంది.
– గంగాసింగ్, దంత వైద్యుడు, బిచ్కుంద
బిచ్కుంద, డిసెంబర్ 9: దేశానికి సేవలందించేందుకు కావాల్సిన సత్తా సీఎం కేసీఆర్‌లో ఉన్నది. విజన్ ఉన్న నాయకుడు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం, టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందడం మంచి పరిణామం.
– లక్ష్మణ్‌రావు, న్యాయవాది, బిచ్కుంద
ధర్పల్లి, డిసెంబర్ 9 : ఇప్పటి వరకు నడిచిన స్వార్థ రాజకీయాలు ఇక దూరం కానున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశ రాజకీయాలకు మంచి రోజులు వచ్చాయి. స్వరాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ వైపు అడుగులు వేసేలా కృషి చేసిన సీఎం కేసీఆర్.. భారత రాష్ట్ర సమితితో దేశాన్ని సైతం ముందుండి నడిపించి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దగలరన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ విజయవంతమై తీరుతుంది.
– దారావత్ గోపాల్ నాయక్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, ధర్పల్లి