Drugs | ఆర్మూర్ పట్టణం, జులై 4 : మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆర్మూర్ ఎస్సై యాసరి అరాఫత్ విద్యార్థులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఎస్సై యాసిర్ అరఫత్ మత్తు పదార్థాలపై విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలపై మత్తు పదార్థాలు, సీసీ కెమెరాలపై షీ టీం పై పూర్తిస్థాయిలో అనగాన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మంచి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరి పాఠశాల పేరుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.