బాల్కొండ : విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం(Midday meal) అందించాలని మన బాల్కొండ మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం బాల్కొండల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంటగది, వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
బియ్యం, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే వండాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్, తదితరులు ఉన్నారు.