రెంజల్, ఆగస్టు 26 : గూడు లేని ప్రతి నీరు పేదలకు తమ ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపికలో అర్హులకే ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి పేపర్ మిల్ గ్రామాల్లో అధికారులతో కలిసి వర్షాలకు నష్టపోయిన సోయా పంటలు, ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరద నీటితో దెబ్బతిన్న పంట నష్టంపై అంచనా వేసి సంబంధిత అధికారులకు నివేదించాలని వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్‌ను ఆదేశించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎంపికలో అధికారులు పారదర్శకత పాటించాలన్నారు. అందుకుగాను మండల నాయకులు, అధికారులకు సహకరించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజిరెడ్డి రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్, బోధన్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ, ఎం ఎల్ రాజు, నీలా విండో చైర్మన్ ఇమ్రాన్ బేగ్, కందకుర్తి మాజీ సర్పంచ్ కలీం బేగ్, మండల నాయకులు గయాసుద్దీన్, ఓబిసి మండల అధ్యక్షుడు లచేవర్ నితిన్, సురేందర్ గౌడ్, ఒడెక్క మోహన్, జావేద్, హాజిఖాన్, ఫుర్కన్, సిరాజ్ బేగ్, నర్సయ్య, సాయగౌడ్, తదితరులు పాల్గొన్నారు.