అబద్ధాల కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధారిలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోతోపాటు కార్నర్ మీటింగ్‌లో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జాజా ల సురేందర్‌తో కలిసి పాల్గొన్నారు.
- ఆరు నెలలైనా అమలుకాని హామీలు
- స్వలాభం కోసమే బీబీ పాటిల్ పోటీ
- పదేండ్లలో ఆయన చేసిందేమీలేదు
- కొత్త నాయకులను తయారుచేస్తాం
- మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం
గాంధారి, మే 2: అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధారిలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోతోపాటు కార్నర్ మీటింగ్‌లో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జాజా ల సురేందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రజలకు మాయ మాటలు చెప్పి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడ న్నారు. గెలిపిస్తే వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చాడని, అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా అమలుచేయడంలేదని మండిపడ్డారు. జహీరాబాద్ ఎంపీగా పదేండ్లు పనిచేసిన బీబీ పాటిల్, ఐదేండ్లు ఎంపీగా ఉన్న సురేశ్‌షెట్కార్ నియోజకవర్గానికి చేసిందేమీలేదన్నారు.
ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం బీబీపాటిల్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. స్వలాభం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రజలను విస్మరించిన వ్యక్తులకు ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. నాయకులు పార్టీ మారినంత మా త్రాన బీఆర్ఎస్కు వచ్చిన నష్టమేమీ లేదని కొత్త నాయకులను తయారుచేస్తామన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారని అన్నారు.

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలుచేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రైతులను రాజు చేయడానికి రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను అమలుచేసినట్లు చెప్పారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని ఆశీర్వదించాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా: గాలి
కార్యకర్తలు కష్టపడి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ కోరారు. తన గెలుపు కోసం కృషిచేసిన ప్రతి కార్యకర్తనూ గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్కు కార్యకర్తలే పెద్ద బలమని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కొందరు నాయకులు బయటికి వెళ్లిపోయినా పార్టీకి జరిగే నష్టమేమి లేదని, కొత్త నాయకులను తయారు చేస్తామని పేర్కొన్నారు. గాంధారి మండలాన్ని దత్తత తీసుకున్న బీబీ పాటిల్ ఎలాంటి అభివృద్ధీ చేయలేదన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. గాలి అనిల్ కుమార్‌ను గెలిపించాలని కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

