ఆర్మూర్ : అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండు కళ్లు అని పీయూసీ చైర్మన్, eర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి (Mla Jeevan Reddy) అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పల్లె గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామస్థులు బీఆర్ఎస్ ( BRS ) కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బీఆర్ఎస్లో చేరారు. వెల్మల్ గ్రామ కురుమ, నాయీ బ్రాహ్మణ, గౌడ , పద్మశాలీ సంఘాల ప్రతినిధులు, ఆర్మూర్ పట్టణంలోని లారీ అసోసియేషన్ సభ్యులు అంకాపూర్లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు నిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 450 పథకాలను అందిస్తుందని పేర్కొన్నారు. దేశమే మురిసిపోయేలా తెలంగాణ మోడల్ గురించి నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగు తోందని వివరించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
సబ్బండ వర్గాలు చల్లగుండాలన్నదే బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యం. సంపద పెంచడం పేదలకు పంచడం కేసీఆర్ ( CM KCR ) కే సాధ్యమని అన్నారు. మూడోసారి కూడా సీఎం కేసీఆరే నని జీవన్ రెడ్డి అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీలని మండిపడ్డారు. రూ.3వేల కోట్ల తో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 60వేల మెజారిటీతో మూడో సారి కూడా గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు.