MLA Bhupathi Reddy| నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం శివారులోని సర్వే నంబర్ 334 లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆర్డీవో రాజేంద్ర కుమార్తో కలిసి సోమవారం స్థలపరిశీలన చేశారు.
ఈ సందర్భంగా స్థలంనకు సంబంధించి రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి తహసీల్దార్ సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.