వేల్పూర్ : మండల కేంద్రంలో రూ.6కోట్ల 30లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు.
వీటి పనులు త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్అండ్బీ అధికారులు, తాసీల్దార్ సతీశ్ రెడ్డి, డీఎల్పీవో శ్రీనివాస్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, టీఆర్ఎస్ నాయకులు సామ మహిపాల్, సామ మహేందర్ తదితరులు ఉన్నారు.