బీర్కూర్/వేల్పూర్/ఎల్లారెడ్డి రూరల్, జూలై 24 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్‌కట్ చేశారు. కేటీఆర్ నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని ఆశీర్వాదం అందించారు. సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
గిఫ్ట్ ఏ స్మైల్ ప్రకటించిన మంత్రి వేముల..
వేల్పూర్ మండలకేంద్రంలోని బీసీ, ఎస్సీ బాలుర వసతిగృహాల విద్యార్థులతో కలిసి బర్త్‌డే వేడుకల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మొక్క నాటారు. విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ప్రకటించారు. హాస్టల్ విద్యార్థుల కోసం సొంత ఖర్చుతో సోలార్ వాటర్ హీటర్ ప్లాంటుతోపాటు దుప్పట్లను పంపిణీ చేసేందుకు హామీ ఇచ్చారు. 200 మందికి రగ్గులు, కార్పెట్ల కోసం రూ. 40 వేలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తూ మంత్రికి గులాబీలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమ జమున, స్థానిక సర్పంచ్ తీగల రాధామోహన్, ఉపసర్పంచ్ బిట్ల సత్యం, ఆర్డీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, టీఆర్ఎస్ నాయకులు మోహన్, కుమ్మరి గంగాధర్, నందిపేట్ ప్రవీణ్, అధికారులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో కేక్ కట్‌చేస్తున్న ఎమ్మెల్యేలు సురేందర్, క్రాంతికుమార్, డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి
బాన్సువాడలో కేక్ కట్‌చేస్తున్న స్పీకర్ పోచారం
ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మంత్రి కేటీఆర్ బర్త్‌డే వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికుమార్ పాల్గొన్నారు. కేక్ కట్‌చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బోయిన్పల్లి ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకుడు కపిల్‌రెడ్డి పాల్గొన్నారు.