కంఠేశ్వర్, అక్టోబర్ 21: జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంజూరు చేయాలని అధికారులకు..జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సోమవారం 513 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎలాంటి కాలయాపన జరగకుండా లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న నెల రోజుల్లోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి,
సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ మకరంద్ రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.