Banswada | సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని బాన్సువాడ మండలంలోని కొత్తబాది సర్పంచ్ సాయాగౌడ్ అన్నారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన సోమవారం గ్రామసభను ఏర్పాటు చేశారు.
Banswada | బాన్సువాడ రూరల్, జూన్ 8 : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని బాన్సువాడ మండలంలోని కొత్తబాది సర్పంచ్ సాయాగౌడ్ అన్నారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన సోమవారం గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి సృజన్ రెడ్డికి సూచించారు.
గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మురికి కాలువలలో మురికి నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను శుభ్రం చేయించాలని అన్నారు. చెత్తా,చెదారాన్ని రోడ్లపై పారవేయకుండా డస్ట్ బిన్ లోనే నిలువ చేసి ప్రతీరోజు ఇంటి ముందు వచ్చే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో చెత్త వేసి గ్రామం పరిశుభ్రంగా ఉండేలా గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామసభలో ఉప సర్పంచ్ సలీం, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

