వేల్పూర్, డిసెంబర్ 24 : నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, యూత్ సభ్యులు సుమారు రెండు వందల మంది శనివారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల మాట్లాడారు. అభివృద్ధి ప్రదాత, అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామం నుంచి బీజేపీ వార్డు సభ్యులు ఆది మహిపాల్, ఉప్పరి మోహన్, విండో మాజీ డైరెక్టర్ సుంకరి సాయిలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆది శ్రీకాంత్‌తోపాటు అనుచరులు, మైనార్టీ విభాగం నుంచి షేక్ కరీం, కానూరి వినోద్, తుప్ప రాజశేఖర్, మున్నూరుకాపు సంఘ సభ్యులు, కొల్లే సంఘ సభ్యులు, మోర్తాడ్ మండలం నుంచి బీఎస్పీకి చెందిన శివ, ధరం, రాజశేఖర్, ప్రవీణ్, నిఖిల్, సంజయ్, సాయితేజ తదితరులు ఉన్నారు. వేల్పూర్‌లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏలియా, పచ్చలనడ్కుడ ఉపసర్పంచ్ గంగారెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.