ఖలీల్‌వాడి, ఆగస్టు 20: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆ ర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు.
ఈ మేరకు కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో కలిసి చేరికల విషయాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి, ఆమె అనుచరులు బీఆర్ఎస్లో చేరుతార ని తెలిపారు. విజయభారతి భర్త అరవింద్ గతంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్కేపు రం డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశార ని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి షాక్ ఇచ్చే లా వలసలు ఉంటాయని పేర్కొన్నారు.