మాక్లూర్, డిసెంబర్ 26: మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షుడు మాస్త ప్రభాకర్‌పై పలువురు ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం చేశారు. మదన్‌పల్లి ఎంపీటీసీ గోవూరి ఒడ్డెన్న ఆధ్వర్యంలో తొమ్మిది మంది ఎంపీటీసీలు సంతకాలు చేసిన తీర్మాన పత్రాన్ని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాకు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌కుమార్‌రెడ్డి, మాక్లూర్ మండల అధ్యక్షుడు రవిప్రకాశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
మదన్‌పల్లి ఎంపీటీసీ గోవూరి ఒడ్డెన్న, గొట్టుముక్కుల ఎంపీటీసీ బేగరి సత్తెమ్మ, డీకంపల్లి ఎంపీటీసీ కాలగడ్డ గంగామణి ఆర్మూర్ ఇన్చార్జి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి మంత్రి జూపల్లి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగాధర్‌గౌడ్, వెంకటేశ్వర్రావు, రవి ప్రకాశ్, దయాకర్ రావు, రాజు, పోశెట్టి పాల్గొన్నారు.