వినాయక్ నగర్, మే: 28: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నగరంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన సుంకరి నర్సయ్య (68) అనే వ్యక్తి ఈరోజు ఉదయం దుబ్బ ప్రాంతం నుండి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా అటువైపుగా వచ్చిన లారీ అతడిని ఢీకొట్టింది. గమనించిన స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
కాగా, దవాఖానలో నర్సయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలలో ఉంటారని, వారికి సమాచారం అందించినట్లు ఎస్ఐ హరిబాబు పేర్కొన్నారు. డెడ్ బాడీని జిల్లా దవాఖాన మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. కృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించనున్నట్లు హరిబాబు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేశామన్నారు.