బీబీపేట్, ఫిబ్రవరి 3: మండలంలోని తుజాల్పూర్ గ్రామశివారులో ఉన్న కూడవెళ్లి వాగు జలకళ సంతరించుకున్నది. మల్లన్నవాగు నుంచి నీటి విడుదల చేపట్టడంతో కూడవెళ్లి వాగులో ప్రవాహం పెరిగింది. దీంతో గ్రామరైతులు సంతోషం వ్యక్తంచేశారు.
సోమవారం రైతులతో కలిసి వాగును పరిశీలించిన జడ్పీ మాజీ వైస్ చైర్మన పరికి ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయడానికి మాజీ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్తం ప్రభాకర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. నీరుపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లి వాగునుంచి నీటిని విడుదల చేయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. మండలంలోని తుజాల్పూర్, మాల్కాపూర్, యాడారం, కోనాపూర్, శివారు రాంరెడ్డిపల్లి గ్రామాల్లోని వేల ఎకరాలకు సాగునీరు అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.