వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలతో చేతికిచ్చిన మొక్కజొన్న పంట నేలపాలైంది. మొక్కజొన్న పంటను మార్కెట్కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన మక్కలు తడిచిపోవడంతో మక్కలకు మొలకలు వచ్చాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.