మాచారెడ్డి : ఉమ్మడి మాచారెడ్డి (Machareddy) మండలంలోని బండరామేశ్వర్పల్లి గ్రామ శివారులో ఉన్న వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను (Sand Tractors) ఎస్సై అనిల్ పట్టుకున్నారు. గురువారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు.
గ్రామాల్లో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. గ్రామాల్లో డంపు చేసిన వాటిని అక్రమంగా తరలించితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని , లేదా డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుతున్నాయని అన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
,