పోతంగల్ సెప్టెంబర్ 02: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సామజిక సేవా యంఏ హకీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును దేశమంతా అద్భుతమని పొగుడుతుంటే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడం వెంటనే మానుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పార్టీ ఇంచార్జి నవీన్, నాయకులు మోరే కిషన్, వల్లేపల్లి శ్రీనివాస్ రావు, తెళ్ల రవికుమార్, ఆరీఫ్, ఆంజనేయులు, అజీమ్ ఉద్దీన్, సుధం సాయిలు, సురేష్ పటేల్, హన్మండ్లు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.