నిజామాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ (Loan waiver) వర్తింపజేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్ లో ఆధ్వర్యంలో రుణమాఫీ కోసం రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 30వేల మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు త్వరలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రాధాన్యం ఇచ్చామని, సకాలంలో రుణమాఫీ, రైతు భరోసా అందించామని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్, పంటలకు నిరంతర కరెంట్, ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరాల, అందుబాటులో విత్తనాలు అందించి ఆదుకున్నామని పేర్కొన్నారు.