ఇందల్వాయి, డిసెంబర్ 3 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి శివారులోని 44వ జాతీయ రహదారిపై ఓ చిరుత మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహ నం ఢీకొన్నది. దీంతో చిరుత కాళ్లకు గాయాలవడంతో కదలలేక కొద్దిసేపు రోడ్డుపై అలాగే పడిపోయింది.
సమాచారం అందుకున్నఇందల్వాయి ఎఫ్ఆర్వో రవిమోహన్ భట్, కామారెడ్డి రేంజ్ అధికారి రమేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిరుతను పరిశీలిస్తుండగా వెంటనే లేచి అటవీప్రాంతంలోకి వెళ్లినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.