భీమ్‌గల్, నవంబర్ 6: మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య క్షేత్రం లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలను నంబి వం శస్థులు నేటి(గురువారం) నుంచి నిర్వహిం చనున్నారు. వారు మాత్రమే స్వామి వారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్తగా నంబి పార్థసారథి వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ కొండకు రావడానికి రవాణాసౌకర్యం అంతంతగానే ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. రూ. 2.60 కోట్లతో కొండపైకి నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రింగ్ లైట్లు, గిరి ప్రదక్షిణలతో గుట్ట ప్రాం తం అందంగా కనువిందు చేస్తున్నది.
పెరిగిన భక్తుల రద్దీ..
గతంలో కేవలం జాతర(ఉత్సవాల)సమయంలో మాత్రమే పెద్దసంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఇప్పుడు ప్రతి శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి పెరిగింది. ఏడాదిలో ఒకసారి మాత్రమే భక్తులు గిరి ప్రదిక్షణ చేసేవారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో గిరి ప్రదక్షిణ కోసం రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ నెల 7 నుంచి క్షేత్రంపై కార్తీక బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి.