KTR birthday | పోతంగల్ జులై 24: పొతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మొక్కలను పంపిణీ చేశారు.
పలువురు మాట్లాడుతూ.. పాలనలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాం నవీన్, అరిఫ్, ఆంజనేయులు, ఎజాస్ గంగాధర్, హన్మంతు, సుధాం సాయిలు, పండరి, సలీం పాషా, గణేష్, సురేష్, అనిల్ పటేల్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.