సిరికొండ, నవంబర్ 13 : చిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో మలావత్ పూర్ణను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు.
పూర్ణకు కేటీఆర్ గురువారం ఫోన్ చేసి మాట్లాడి పరామర్శించారు. పూర్ణ తండ్రి మరణంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని.. తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. త్వరలోనే స్వయంగా వచ్చి కుటుంబాన్ని కలుస్తానని హామీ ఇచ్చారు.