గాంధారి/ రామారెడ్డి/సదాశివనగర్, ఆగస్టు 11: ఎల్లారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారం భోత్సవానికి ఈ నెల 14న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మె ల్యే జాజాల సురేందర్.. బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గాంధారి, సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద ఉన్న అశోక్ గార్డెన్లో సదాశివనగర్, రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాజాల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. బహిరంగ సభకు ప్రజలను పెద్ద సంఖ్యలతో తరలించాలని సూచించారు. అనంతరం చలో ఎల్లారెడ్డి, బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. గాంధారిలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీరావు, జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణరావు, విండో చైర్మన్ పి.సాయికుమార్, స ర్పంచ్ మమ్మాయి సంజీవ్, బీఆర్ఎస్ సీనియర్ నా యకులు ముకుంద్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ భజన్‌లాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డిరాజు, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, సదాశివనగర్‌లో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి సదాశివనగర్ మండల అధ్యక్షుడు బొల్లిపెల్లి మహేందర్‌రెడ్డి, రంగు రవీందర్‌గౌడ్, జడ్పీటీసీ నర్సింహులు, రామారెడ్డి ఎంపీపీ నా రెడ్డి దశరథ్‌రెడ్డి,అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భూంరెడ్డి, గురజాల నారాయణరెడ్డి, ఎంపీటీసీ బీరయ్య, గైని రమేశ్, పడిగెల రాజేశ్వర్‌రావు, విండో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే సురేందర్
ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 11: ఎల్లారెడ్డికి ఈ నెల 14న మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్ల ను ఎమ్మెల్యే జాజాల శుక్రవారం పర్యవేక్షించారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సభాస్థలి నిర్వాహకులకు సూచించారు.