వేల్పూర్, జూలై 4 : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. వేల్పూర్ మండలంలోని పడిగెల్ గ్రామశివారులో కౌలుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో వరి నారుమడిలో ఇంగ్లిష్‌లో ‘కేటీఆర్’ అనే అక్షరాలను వరి నారుతో రూపొందించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో ఎరువులు, సాగునీరు, కరెంట్, పెట్టుబడి సాయం, పంటలకు మద్దతు ధర అందేవని ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి గుర్తుచేసుకున్నాడు.కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశాడు.