మోర్తాడ్/ఖలీల్‌వాడి, జూలై 24 : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొని, కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే కేక్ తినిపించారు.
కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, మహేశ్ బిగాల
కామారెడ్డి జిల్లాకేంద్రంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, సీనియర్ నాయకులు