కోటగిరి అక్టోబర్ 14 : సైబర్ నేరాలు పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుందని, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫేక్ నంబర్ నుంచి కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పకూడదన్నారు.
ముఖ్యంగా కొంతమంది అతి ఆశకు వెళ్లి తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నెలల సంఖ్య పెరిగిందని పే౦ర్కొన్నారు. ఇక మీదట సైబర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితం నాశనం అవుతుందన్నారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ కైసర్ పాషా, అధ్యాపకులు ప్రమోద్, దత్తాత్రి తదితరులు ఉన్నారు.