నర్సాపూర్, ఫిబ్రవరి13: నర్సాపూర్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాకపోవడమే అందుకు కారణం. మొత్తం 15 వార్డులకు ఎన్నికలు జరుగగా.. బీఆర్ఎస్ పార్టీ 5, కాంగ్రెస్ పార్టీ 6, బీజేపీ 4 వార్డు్ల్లో విజయం సాధించాయి. దాంతో.. చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది.
ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే కనీసం 8 మంది కౌన్సిలర్ల కోరం కావాలి. ఈ పరిస్థితుల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో.. కోరం ప్రకారం 8 మంది మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉండడంతో చైర్మన్ పీఠందక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.