CITU | కోటగిరి : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్( సీఐటియూ ) మండల నూతన కమిటీని మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు.
మండల జీపీ యూనియన్ అధ్యక్షురాలిగా రాజేశ్వరి( ఎత్తొండ), ప్రధాన కార్యదర్శిగా లింగం(కొత్తపల్లి), కోశాధికారిగా జాకీర్ హుస్సేన్ (యాద్ గార్ పూర్), ఉపాధ్యక్షులుగా పోశెట్టి శేఖర్, సహాయ కార్యదర్శులుగా రజిని, చాందిబాయి, లింగవ్వ, ఎల్లయ్య ఎన్నికయ్యారని నన్నేసాబ్ తెలిపారు. మే డే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం నూతన కమిటీ సభ్యులు రాజీలేని పోరాటం చేయాలని ఆయన సూచించారు.