Nutrition | బాల్కొండ : పోషకాహారం ప్రాముఖ్యతను తెలుసుకోవాలని వన్నెల్బీ హైస్కూల్ హెచ్ఎం రాజేశ్వర్ సూచించారు. మండలంలోని వన్నెల్బీ గ్రామంలోని హైస్కూల్లో అంగన్వాడీ సెంటర్-4 లో గర్భిణీలు, బాలింతలు, పిల్ల తల్లులకు పోషణ పక్షం అనే కార్యక్రకమానికి సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వారికి థౌసండ్ డేస్ గోల్డెన్ డేస్ కు గల ప్రాముఖ్యత, పోషకాహార ప్రాముఖ్యతను అంగన్ వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తెలియజేశారు. సంపూర్ణ వికాసం కలిగిన బాల బాలికలు తయారు కావాలంటే వారు శారీరకంగా మానసికంగా నైతికంగా మేథోపరంగా వ్యక్తిగత సామాజిక అభివృద్ధిపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం దేవకీ, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.