Nizamabad | వినాయక నగర్, మార్చి 04 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకే కులానికి చెందిన ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. చిన్నపాటి విషయానికి గొడవపడి ఓ వ్యక్తి తన పద్ధతిని కత్తితో పొడిచాడు.
మంగళవారం మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని గాజులపేట ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రెండవ టౌన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. నాయి బ్రాహ్మణ కులస్తులు ఈరోజు మధ్యాహ్నం తమ సంఘంలో మీటింగ్ నిర్వహించుకున్నారు. మీటింగ్ అనంతరం మహేష్ అనే వ్యక్తి తన కులస్తుడైన సంతోష్‌ను ఎదురించి మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన సంతోష్ ఇంట్లోంచి కూరగాయలు కోసే కత్తి తీసుకువచ్చి మహేష్ కడుపులో పొడిచాడు. ఈ దాడిలో రక్తస్రావమైన మహేష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సంతోష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.