బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఉమ్మడి జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి తన జీవితాన్ని పణంగా పెట్టిన కేసీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న కుట్రల్లో భాగంగానే ఆయనకు నోటీసులు అందజేశారని పేర్కొన్నారు.
చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించి దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను పంపడాన్ని కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులుగానే పరిగణిస్తున్నామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌కు నోటీసులు పంపడం పూర్తిగా రాజకీయ కక్ష పూరిత చర్య అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విశ్వఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్‌కు వచ్చిన పేరుప్రతిష్టలు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతోందని మండిపడ్డారు.రేవంత్‌రెడ్డి సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
-కంఠేశ్వర్/ ఖలీల్‌వాడి, మే 20
అవి కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులు
మోర్తాడ్, మే 20: చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించి దేశంలో తెలంగాణను అగ్రగా మిగా నిలిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను పంపడాన్ని కాంగ్రెస్ రాజకీయ కమిష న్ నోటీసులుగానే పరిగణిస్తున్నామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలం గాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌కు నోటీసులు పంపడం పూర్తిగా రాజకీయ కక్ష పూరిత చర్య అని పేర్కొన్నారు. నిద్రాహారాలు లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల సాగునీటి గోస తీర్చేందుకు కేసీఆర్ కాళే శ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని, దీంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారిందని, పచ్చని పంటలో కళకళలాడిందని గుర్తుచేశారు.
పాలన చేతకాని రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజల దృష్టి మరల్చేందుకు అవసర మున్నప్పుడల్లా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌పై చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ సమాజం నమ్మదని పేర్కొన్నారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ శ్రేయస్సు కోసమే పనిచేసే కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలు చేయడం తెలంగాణ సమాజం సహించదని పేర్కొన్నారు. సూర్యుడి మీద ఉమ్మి వేయాలని చూస్తే అది మీ మీదే పడుతుందన్న విషయాన్ని గమనించాలని, ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే వేముల సూచించారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
ఖలీల్‌వాడి, మే 20 : తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. విశ్వఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్‌కు వచ్చిన పేరుప్రతిష్టలు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతోందని మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నయా పైసా దుర్వినియోగం జరగకపోయినా ఏదో అవినీతి జరిగినట్లు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను పక్కదారి పట్టించిన కాంగ్రెస్ జిత్తులమారి రాజకీయం చేసి గోబెల్స్ కూడా సిగ్గుపడుతాడని ఎద్దేవా చేశారు.
అసలు ఏం నేరం చేశారని కేసీఆర్‌ను వేధిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించినందుకా ? 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో కాంగ్రెస్, బీజేపీలను గడగడలాడించి మెడలు వంచినందుకా ? తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కలను సాకారం చేసేందుకు ఆమరణ దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి పోరాడినందుకా ? పదేండ్ల ముందు చూపు పాలనతో తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు సాగునీరిచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా ? రైతుబంధు, బీమా ఉచిత విద్యుత్‌తో రైతును రాజును చేసినందుకా ? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరిచ్చినందుకా ? అని జీవన్‌రెడ్డి నిలదీశారు.
అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను ఏమార్చి 1.5 శాతం ఓట్లతో అధికారం దక్కించుకుని తంతే గారెల బుట్టల పడ్డోడు ఇప్పటి సీఎం రేవంత్ అని మండిపడ్డారు. ఏడాదిన్నర తిరగక ముందే పాలన చేతకాక చేతులు ఎత్తేసి లేపి కూతలు కూస్తూ తెలంగాణ పరువును బజారున పడేస్తున్న కాంగ్రెస్ రాష్ర్టానికి అరిష్టమన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో పెట్టుడు తప్ప తిట్టుడు లేదని, సంపద పెంచి పేదలకు పంచడం ఒక్కటే ఆయనకు తెలసని పేర్కొన్నారు. ఏం పాపం చేశారని కేసీఆర్ వెంట పడ్డారో చెప్పాలనిడిమాండ్ చేశారు. విచారణల పేరుతో వేధిస్తే తెలంగాణ ప్రజలు సహించరని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో గోక్కున్నోళ్లెవరు బాగుపడలేదని, కేసీఆర్ జోలికొచ్చినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.