కార్తీకపౌర్ణమి సందర్భంగా శైవాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. కార్తీక దీపాల వెలుగుల్లో ఆలయాలు మిరుమిట్లుగొలిపాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెతారు. దీపాలు వెలిగించి భక్తితో వచ్చి స్వామి వారిని కొలిచారు.
సుహాసినులు ఇండ్లల్లో తులసీ పూజలు నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వరాలయం, బోధన్‌లోని ఏకచక్రేశ్వరాలయం సహా ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులతో సందడిగా మారాయి.